ఉన్నత పాఠశాలల పనివేళలు పెంపు! 1 m ago
రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల పని వేళలు పెంచేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల సమయంలో మార్పులు చేస్తూ కొత్త టైం టేబుల్‌ను సిద్దం చేసి, ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాలో అమలు చేసి తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న సమయానికి మరో గంట అదనంగా పెంచేందుకు ప్రభుత్వం సిద్దమైంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఉన్నత పాఠశాలలో పని వేళల్లో మార్పులు
ప్రస్తుతం ఉన్నత పాఠశాలల పనివేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతున్నాయి. దీనిని ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమలు చేసే దిశగా, ముందుగా నెల్లూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఈ మార్చిన కొత్త టైం టేబుల్ ను నెల్లూరు జిల్లాలోని ఒక మండలంలోని ఉన్నత పాఠశాల లేదా హైస్కూల్ ప్లస్ లో అమలు చేయాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కొత్త టైం టేబుల్
ఈ నెల 25 నుంచి 30 వ తేదీ వరకు ఈ టైం టేబుల్ని అమలు చేసి ఫీడ్ బ్యాక్ ని అందించాలని స్పష్టం చేసింది. సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలల వేళలు పొడిగించి ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్‌ల సమయం 5 నిమిషాల చొప్పున, భోజన విరామం 15 నిమిషాల చొప్పున పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేసారు.
ఈ సరికొత్త టైం టేబుల్ అమల్లో భాగంగా సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలల పని వేళలను పొడించనున్నారు. అలాగే ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్‌ల సమయాన్ని5 నిమిషాల చొప్పున, భోజన విరామం 15 నిమిషాలు పెంచుతూ ప్రతిపాదనలు సిద్దం చేసారు. ఇక నుంచి ఉదయం జరిగే పీరియడ్‌లలో 5 నిమిషాలు పెంచి 50 నిమిషాలు చేస్తూ, ఆ తర్వాత మధ్యాహ్నం జరిగే 3 పీరియడ్లు ప్రస్తుతం 40 నిమిషాల చొప్పున ఉండగా వాటిని 45 నిమిషాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.